వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్‌లో పసుపు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ-వేలంలో కాడిరకం క్వింటాకు రూ.19,253, గోళరకానికి రూ.18,566 గరిష్ఠ ధర లభించింది.
ఈ నెల 22న సగటు ధర రూ.13,319 ఉండగా, ఐదు రోజుల్లోనే రూ.6 వేల వరకు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని దుగ్గిరాల యార్డులోనూ ఇటీవల క్వింటాకు రూ.18,400 ధర నమోదైంది.
Comments
Loading comments...

