Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడారిలో దాహంతో 49 మంది మృతి

Follow Udayam on Google
Sanjay Gupta Jun 06, 2026 7:39 AM జాతీయంGeneral
ఎడారిలో దాహంతో 49 మంది మృతి - Udayam
నైజర్‌ దేశంలోని సహారా ఎడారిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 51 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక లారీ ఎడారి మధ్యలో అకస్మాత్తుగా చెడిపోయింది. చుట్టుపక్కల ఎలాంటి మానవ సంచారం, నీటి వనరులు లేకపోవడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. తీవ్రమైన ఎండలు, మూడు రోజుల పాటు తాగడానికి బొట్టు నీరు కూడా దొరక్కపోవడంతో 49 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదం నుండి కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు.

Comments

G
Loading comments...