Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

278 ఆసుపత్రులకు రూ. 501 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల

Follow Udayam on Google
Udayam Staff May 04, 2026 12:18 AM అమరావతిGeneral
278 ఆసుపత్రులకు రూ. 501 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల - Udayam
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలోని అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటివరకు 278 ఆసుపత్రులకు రూ. 501 కోట్లు విడుదల చేసినట్లు ట్రస్టు ఇన్‌చార్జి సీఈఓ చక్రధరబాబు వెల్లడించారు. మిగిలిన బకాయిల కోసం ‘ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్’ విధానం ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ విధానం కింద 531 ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికే 336 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ఒప్పందాల ప్రకారం నిధుల విడుదల కొనసాగుతుందని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...