Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Follow Udayam on Google
Rohit Jun 15, 2026 8:53 AM తిరుపతిGeneral
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 24 గంటలు - Udayam
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లు శిలాతోరణం వరకు నిండిపోయాయి. ఆదివారం రోజున 95,094 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.3.93 కోట్లుగా నమోదైంది. అలాగే 35,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, భక్తులు క్యూలో వేచి ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడమైనది.

Comments

G
Loading comments...