వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వారాంతం కావడంతో తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, భక్తుల క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వరకు సాగాయి.
ప్రస్తుతం సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుందని తితిదే పేర్కొంది. గురువారం రోజున 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, తిరుమలలో ప్రస్తుతం తరచూ వర్షపు జల్లులు కురుస్తున్నాయి.
Comments
Loading comments...

