Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

Follow Udayam on Google
Rohit Varma Jun 11, 2026 7:18 AM తిరుపతిGeneral
శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు - Udayam
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తుల క్యూలైన్ శిలాతోరణం దాటి బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు విస్తరించింది. మరోవైపు టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులు కూడా క్యూకాంప్లెక్స్‌లోని ఆరు కంపార్టుమెంట్లలో తమ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

Comments

G
Loading comments...