Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సంస్థల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి టెలీకాన్ఫరెన్స్

Follow Udayam on Google
Udayam Staff May 04, 2026 12:09 AM అమరావతిGeneral
 విద్యుత్ సంస్థల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి టెలీకాన్ఫరెన్స్ - Udayam
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థల సీఎండీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరించాలని, ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయని అధికారులు వివరించగా, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...