వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్‌కు చెందిన ఏడుగురు ఎంపీల భాజపాలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో ఎగువ సభలో భాజపా బలం 113కు చేరగా, ఆప్ బలం కేవలం మూడుకు పరిమితమైంది.
పార్టీ పనితీరుపై అసంతృప్తితోనే తాము భాజపాలో చేరామని సదరు ఎంపీలు స్పష్టం చేశారు. మరోవైపు, పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎంపీల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఆప్ అధిష్ఠానం ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది.
Comments
Loading comments...

