వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఇకపై పీఎఫ్ నిధులను ఏటీఎంల ద్వారా నేరుగా విత్డ్రా చేసుకునే సదుపాయం రానుంది. ఇందుకోసం 'ఈపీఎఫ్ఓ 3.0' వ్యవస్థ ద్వారా పీఎఫ్ ఖాతాలను బ్యాంకింగ్ నెట్వర్క్తో అనుసంధానించనున్నారు.
సాంకేతిక పరీక్షలు పూర్తయిన ఈ విధానాన్ని ప్రధాని మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. దీనికోసం ప్రత్యేక కార్డులు జారీ చేయబడతాయి. ఇకపై ఎలాంటి కాగితపు పనులు లేకుండా, బ్యాంక్ నుంచి డబ్బులు తీసినంత సులభంగా పీఎఫ్ సొమ్మును పొందే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...

