వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతికి నడిచే రెండు వీక్లీ స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయించింది. పండర్పూర్ రైలు ఈ నెల 16 నుండి, నాందేడ్ రైలు ఈ నెల 9 నుండి నిత్యం అందుబాటులో ఉండనున్నాయి.
ఈ రైళ్లు కడప, కాచిగూడ మీదుగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల భక్తులకు, ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది. మరో రైలు క్రమబద్ధీకరణపై త్వరలో స్పష్టత రానుంది.
Comments
Loading comments...

