వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఇంధన కొరత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 పెట్రోల్ బంకుల్లో సగానికి పైగా మూతపడటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల ముందుచూపు లేకపోవడంతో సమస్య తీవ్రరూపం దాల్చి, వాహనదారులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాయాల్సి వస్తోంది.
రైతులకు డీజిల్ కష్టాలు మరింతగా చుట్టుముట్టాయి. వరికోత యంత్రాలు, ఆక్వా రంగంలో పనులు ఆగిపోవడంతో పంట మార్కెటింగ్‌కు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించకముందే ప్రభుత్వం స్పందించి, ఇంధన నిల్వలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

