వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలో చేరుతున్నామని ప్రకటించిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఆప్ రాజ్యసభ చైర్మన్‌ను కోరింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన ఆ ఎంపీలపై న్యాయపరమైన చర్యలు తప్పవని ఎంపీ సంజయ్ సింగ్ హెచ్చరించారు.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం ఫిరాయింపులకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, కేజ్రీవాల్ నివాసంపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

