Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిప్రమాదాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Udayam Staff May 04, 2026 12:08 AM అమరావతిGeneral
 అగ్నిప్రమాదాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam
వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లను నివారించేందుకు ఎంసీబీ (MCB)ల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని కోరారు. మాల్స్, సినిమా థియేటర్లు, అపార్ట్‌మెంట్‌లలో ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...