వార్తలకు తిరిగి వెళ్లండి

వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర సంచలనం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ హత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఒక భద్రతాధికారి గాయపడగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటన సమయంలో ప్రథమ మహిళ మెలానియా, జేడీ వాన్స్ సహా పలువురు ప్రముఖులు వేదిక వద్ద ఉండగా, కాల్పుల శబ్దంతో అతిథులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ ఈ విందుకు హాజరుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Comments
Loading comments...

