Back to feed
వైకాపా నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు: కారణమిదే!
Udayam Digital Staff Apr 21, 2026 9:50 AM అమరావతి 10 views18 days ago

వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, శనివారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన నిరసన దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు ఎటువంటి ముందస్తు అనుమతి లేకపోవడంతో పాటు, దీనివల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన తెలపడం, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...



