Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రష్యా చమురుపై అమెరికా యూటర్న్; మే 16 వరకు ఆంక్షల సడలింపు.

Udayam Digital Staff Apr 18, 2026 5:17 AM అల్ ఇండియా 9 views21 days ago
రష్యా చమురుపై అమెరికా యూటర్న్; మే 16 వరకు ఆంక్షల సడలింపు. - Udayam Digital
రష్యా చమురు ఆంక్షల విషయంలో అమెరికా ప్రభుత్వం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలుపై విధించిన ఆంక్షలను మరో నెల రోజుల పాటు, అంటే మే 16 వరకు సడలిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే సముద్రంలో ప్రయాణిస్తున్న రష్యా చమురు నౌకల నుండి మాత్రమే ఈ కొనుగోళ్లు జరపాలని అమెరికా స్పష్టం చేసింది. ఆంక్షలు పొడిగించబోమని గతంలో కఠినంగా వ్యవహరించిన ట్రంప్ సర్కారు, ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...