Back to feed
తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్రావు గృహనిర్బంధం.
Udayam Digital Staff Apr 18, 2026 4:55 AM హైదరాబాద్ 10 views21 days ago

మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన భాజపాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్రావును పోలీసులు ఆయన నివాసంలో గృహనిర్బంధం చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పలువురు ముఖ్య నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ చర్యపై రామచందర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలను అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. మహిళా శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని ఆరోపిస్తూ, తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...



