Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చైనీయులకు పర్యాటక వీసాల జారీ: భారత్ నిర్ణయం.

Udayam Digital Staff Apr 24, 2026 6:24 AM అల్ ఇండియా 5 views15 days ago
చైనీయులకు పర్యాటక వీసాల జారీ: భారత్ నిర్ణయం. - Udayam Digital
గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో గత ఐదేళ్లుగా నిలిపివేసిన చైనీయుల పర్యాటక వీసాలను భారత్ పునరుద్ధరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ, చైనా మరియు హాంకాంగ్ పౌరులకు పర్యాటక వీసాల జారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంలో భాగంగా ఈ చర్య చేపట్టారు. ఇప్పటికే విమాన సర్వీసులు, కైలాస మానససరోవర్‌ యాత్రలను పునరుద్ధరించిన నేపథ్యంలో, తాజా వీసా సడలింపులతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...