వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల అవినీతి రహిత పాలనతో ఇక్కడ సానుకూల వాతావరణం ఉందని, రాబోయే రోజుల్లో తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కవిత కొత్త పార్టీపై స్పందిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. దీన్‌దయాల్ ప్రశిక్షణ తరగతులతో శ్రేణులను ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

