Back to feed
ఏసీ ధరలు పెంపు: శ్రీసిటీ ప్లాంట్ విస్తరణకు డైకిన్ భారీ పెట్టుబడి
Udayam Digital Staff Apr 24, 2026 8:56 AM అల్ ఇండియా 10 views15 days ago

ఏసీ తయారీ దిగ్గజ సంస్థ డైకిన్ ఏపీలోని శ్రీసిటీ ప్లాంట్ విస్తరణ కోసం రూ. 1,000 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతోంది. కొత్తగా ఆర్అండ్డీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ముడి సరకుల ధరల పెరుగుదల, దేశీయ బీఈఈ ప్రమాణాల కారణంగా ఏసీ ధరలను 7% వరకు పెంచినట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది అమ్మకాల్లో 20% వృద్ధిని ఆశిస్తున్నట్లు డైకిన్ ప్రతినిధి సంజయ్ గోయల్ వెల్లడించారు. హైదరాబాద్లో ఎక్స్పీరియెన్స్ సెంటర్ను కూడా తాజాగా ఘనంగా ప్రారంభించారు.
Comments
Loading comments...



