Back to feed
ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు!
Udayam Digital Staff Apr 20, 2026 8:51 AM అల్ ఇండియా 15 views19 days ago

ఎయిర్‌టెల్ తన 84 రోజుల వ్యాలిడిటీ గల ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.859 నుంచి రూ.899కి పెంచింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా చేసిన ఈ పెంపు వల్ల వినియోగదారులపై రూ.40 అదనపు భారం పడింది. అదనపు ప్రయోజనాలేవీ లేకుండానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో రూ.799 ప్లాన్‌ను సైతం తొలగించింది. జియో వంటి ప్రత్యర్థులతో పోలిస్తే ఎయిర్‌టెల్ ధరలు ఎక్కువగా ఉండటం వినియోగదారులను అసంతృప్తికి గురిచేస్తోంది.
Comments
Loading comments...



