వార్తలకు తిరిగి వెళ్లండి

మైసూరులోని ‘ఫాక్స్ జెన్ పబ్’లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సాహిన్, ప్రకాశ్ అనే ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో పబ్‌లో సుమారు 25 మంది ఉండగా, అగ్నిమాపక సిబ్బంది 15 మందిని రక్షించారు.
అత్యవసర ద్వారాలు లేకపోవడం, రెల్లు గడ్డి పైకప్పు, మద్యం సీసాల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

