వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని సీఐ ఉపేందర్ రావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై ఎస్ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని సీఐ పేర్కొన్నారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

