Back to feed
తమిళనాడు బీజేపీకి మరో షాక్: రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేశ్ రాజీనామా
Aparna Mukherjee Jun 06, 2026 10:26 AM అల్ ఇండియా 11 viewsabout 3 hours ago

తమిళనాడు భారతీయ జనతా పార్టీలో (TN BJP) సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ ఇటీవలే పార్టీని వీడగా, తాజాగా ఆ బాటలోనే మరో కీలక నేత, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేశ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆమె తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ లేఖను పంచుకుంటూ, ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. పార్టీని వీడినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, జాతీయవాదం, దేశభక్తి సిద్ధాంతాలు తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని సుమతి వెంకటేశ్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

