Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం.. డిసెంబరు 10న పెళ్లి

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 12:02 PM జాతీయంవినోదం
సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం.. డిసెంబరు 10న పెళ్లి - Udayam
టాలీవుడ్‌ నటుడు సాయి దుర్గా తేజ్‌ ఓ ఇంటివాడయ్యేందుకు సిద్ధమయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో కిరణ్‌తో ఆయన నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన పలువురు హాజరై జంటను ఆశీర్వదించారు. డిసెంబరు 10న హైదరాబాద్‌లోనే వీరి వివాహం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Comments

G
Loading comments...