వార్తలకు తిరిగి వెళ్లండి

ముల్లన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. కేఎల్ రాహుల్, గిల్ శతకాలతో కదం తొక్కగా.. రిషబ్ పంత్ (81) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడంతో.. 'కోచ్ గంభీర్ చెప్పిన డిఫెన్స్ మాట వినకుండా ఆడావు, మూల్యం చెల్లించావు' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
అయితే, అఫ్గాన్‌పై అత్యధిక స్కోరు చేసిన భారత వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. రెండో రోజు లంచ్ సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్ క్రీజులో ఉన్నారు.
Comments
Loading comments...

