Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:57 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు - Udayam
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలను ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్రలో గంటకు 50-60, దక్షిణ కోస్తాలో 40-50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. విజయవాడలో శనివారం భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Comments

G
Loading comments...