వార్తలకు తిరిగి వెళ్లండి

మునుగోడులో ఏదుల నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటి తరలింపు అంశంపై మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

