Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలి

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 2:46 PM జగిత్యాలGeneral
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలి - Udayam
జగిత్యాలలోని గాంధీనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కృష్ణకుమారి ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్‌ కృష్ణకుమారి సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...