వార్తలకు తిరిగి వెళ్లండి

ముదినేపల్లి మండలంలో కూటమి బలపరిచిన బీజేపీ ఎంపీపీ అభ్యర్థి కోటప్రోలు నాగరత్న కుమారికి ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం బీ-ఫారం అందజేశారు. తన నివాసంలో కూటమి నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
నాగరత్న కుమారి తరఫున ఆమె కుమారుడు కృష్ణ బీ-ఫారం అందుకున్నారు. టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొత్త నాగేంద్ర కుమార్‌తో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

