వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ పరిధిలోని తేనుగువారిపల్లిలో మంగళవారం ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్ నిర్మాణ పనులను సర్పంచ్ భూక్య రాజు నాయక్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పనులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కూలీలు, గ్రామ కార్యదర్శి, మేటు రమేశ్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

