వార్తలకు తిరిగి వెళ్లండి

వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. రావులపెంట క్లస్టర్ ఏఈఓ కుర్ర రమేశ్ ఎల్‌నినో పరిస్థితులు, యాసంగి పంటల ప్రణాళిక, నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు.
ప్రకృతి వ్యవసాయం, కపాస్ కిసాన్ యాప్ వినియోగంపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎలికట్టి భరత్, ఉప సర్పంచ్ గంట స్వాతి నరసయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

