వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురం శాంతినగర్ కాలనీలో మురుగు నీటి పారుదలకు కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత 12 ఏళ్లుగా సమస్య కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. వర్షం పడితే రోడ్లపై నీరు రోజుల తరబడి నిలిచి దుర్వాసన, దోమల బెడద పెరుగుతోందని వాపోయారు.
మురుగు నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల రహదారులు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

