వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెల 22న క్వింటాకు రూ.13,319 ఉన్న సగటు ధర.. ఐదు రోజుల్లోనే రూ.6,000 వరకు పెరిగింది.
ఈ-వేలంలో కాడిరకం పసుపు గరిష్ఠంగా రూ.19,253, గోళరకం రూ.18,566 పలికాయి. ఏపీలోని దుగ్గిరాల యార్డులోనూ రూ.18,400 గరిష్ఠ ధర నమోదైంది. ధరల పెరుగుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

