వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో ఐదు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. ప్రతి రెండు నెలలకొకసారి భేటీ కావాలని నిర్ణయించారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.
దీంతో పాటు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ద్వారా ఓట్ల లూటీ జరుగుతోందని ఆరోపిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి (CJI) లేఖ రాయాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
Comments
Loading comments...

