వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ తన అణ్వాయుధ సంపత్తిని 190కి పెంచుకుందని స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) వెల్లడించింది. పొరుగు దేశమైన పాకిస్థాన్ (170) కంటే భారత్ వద్ద 20 ఆయుధాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో భారత్ కొత్తగా 10 వార్‌హెడ్లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుంది.
ప్రపంచవ్యాప్తంగా చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉండగా, రష్యా, అమెరికాలు అత్యధిక ఆయుధాలతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. అలాగే, అంతర్జాతీయంగా రక్షణ రంగ వ్యయంలో భారత్ 92.1 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో కొనసాగుతోందని సిప్రి తాజా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.
Comments
Loading comments...

