Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాజీపూర్‌లో బెటాలియన్ పోలీసుల బైక్ ర్యాలీ

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:10 PM మంచిర్యాలGeneral
హాజీపూర్‌లో బెటాలియన్ పోలీసుల బైక్ ర్యాలీ - Udayam
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గుడిపేట 13వ బెటాలియన్ పోలీసులు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి గ్రామాల మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు ర్యాలీ సాగింది. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అసిస్టెంట్ కమాండెంట్లు వీర రాజు, ఆంజనేయ రెడ్డితో పాటు పోలీసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...