వార్తలకు తిరిగి వెళ్లండి

వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన వారికి గ్యాస్ సబ్సిడీని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. అనర్హులను గుర్తించేందుకు ఐటీ శాఖ డేటాను వాడుతూ, ఇప్పటికే వినియోగదారులకు హెచ్చరిక సందేశాలు పంపడం ప్రారంభించింది.
సంపన్నుల రాయితీని తగ్గించి, ఆ నిధులను పేదల సంక్షేమం కోసం వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం అర్హత లేని వారు వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో సబ్సిడీ రద్దవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

