వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో మంగళవారం ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’లో భాగంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ‘చట్టం తెలుసుకో.. బాల్యాన్ని కాపాడుకో’ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అవినాష్ మాట్లాడారు.
బాల్య వివాహాలు చేయడం, బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం నేరమని ఆయన వివరించారు. చట్టాలపై అవగాహనతో బాల్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

