వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర రైల్వే స్టేషన్ ప్రధాన మెట్ల వద్ద మంగళవారం ఉదయం ఓ యాచకుడు మృతి చెందాడు. స్టేషన్ వద్ద భిక్షాటన చేసేవాడైన అతడు నిద్రిస్తున్న సమయంలోనే మరణించి ఉండవచ్చని రైల్వే ఏఎస్సై మహబూబ్ ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు.
మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు బాసర రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

