వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భాను ప్రతాప్ సింగ్ అలియాస్ బబ్లూ హతమయ్యాడు. పోలీసులపై అతడు కాల్పులు జరపడంతో ఎస్టీఎఫ్, యూపీ పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో బబ్లూ మరణించాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
వివిధ జిల్లాల్లో దాదాపు 40 కేసులున్న బబ్లూ తలపై రెండు లక్షల రూపాయల రివార్డు ఉంది. దీర్ఘకాలంగా పరారీలో ఉన్న ఇతడిని పక్కా సమాచారంతో చుట్టుముట్టగా పోలీసులపైకి తిరగబడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
Comments
Loading comments...

