Back to feed
సీఎం చంద్రబాబు వ్యాఖ్యల వక్రీకరణ: వైకాపాపై లోకేశ్ ఆగ్రహం
Udayam Digital Staff Apr 25, 2026 5:54 AM అమరావతి 6 views14 days ago

తిరుపతి టిడ్కో ఇళ్ల పంపిణీలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుకు ఇచ్చిన హామీని వైకాపా వక్రీకరిస్తోందని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టత ఇచ్చినా, వైకాపా తన దుష్ప్రచారాన్ని ఆపడం లేదని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు.
ఓ లబ్ధిదారు ఆటో డ్రైవర్ కావడంతో ఆటో ఇస్తామని సీఎం అన్న మాటలను, ఎడిటింగ్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...



