Back to feed
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తెదేపా మద్దతు; మహిళల ఏళ్ల నాటి కల నిజం కాబోతోందన్న ఎంపీ లావు.
Udayam Digital Staff Apr 17, 2026 8:57 AM అల్ ఇండియా 19 views22 days ago

మహిళా రిజర్వేషన్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. చట్టసభల్లో మహిళల గొంతుక మరింత బలంగా వినిపించేందుకు ఈ నిర్ణయం గొప్ప అవకాశమని, దేశంలోని 50 శాతం మహిళల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయని ఆయన పేర్కొన్నారు.
దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం ప్రధాని మోదీ నాయకత్వంలో ఫలించబోతోందని ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియకు కూడా తమ పార్టీ మద్దతు ఉంటుందని, మహిళా సాధికారత దిశగా ఇది చారిత్రాత్మక ముందడుగు అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...



