Back to feed
తెలంగాణ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకోం! మహిళా బిల్లులో బీసీ కోటా కావాల్సిందే.. కేంద్రంపై కవిత ఫైర్.
Udayam Digital Staff Apr 16, 2026 9:08 AM హైదరాబాద్ 6 views23 days ago

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెట్టడం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ చర్య ద్వారా తెలంగాణ రాజకీయ ప్రాధాన్యతను తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.
మహిళా రిజర్వేషన్లలో బీసీ సబ్ కోటా తప్పనిసరిగా ఉండాలని కవిత డిమాండ్ చేశారు. మహిళల హక్కులను అడ్డం పెట్టుకుని కేంద్రం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...



