Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ట్రంప్ దూకుడుకు చైనా-రష్యా చెక్! అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టేలా జిన్‌పింగ్ సరికొత్త వ్యూహం.

Udayam Digital Staff Apr 16, 2026 10:32 AM అల్ ఇండియా 10 views23 days ago
ట్రంప్ దూకుడుకు చైనా-రష్యా చెక్! అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టేలా జిన్‌పింగ్ సరికొత్త వ్యూహం. - Udayam Digital
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా చైనా, రష్యా దేశాలు వ్యూహాత్మకంగా ఏకం కావాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. బ్రిక్స్, ఎస్‌సీవో వేదికలపై పరస్పర సహకారం పెంచుకోవాలని కోరారు. ప్రపంచం మళ్లీ ఆటవిక రాజ్యంలా మారకుండా అంతర్జాతీయ నియమాలను పునరుద్ధరించాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అమెరికా ఆధిపత్యానికి కళ్లెం వేసేలా బహుళపాక్షిక వాదాన్ని రక్షించుకోవాలని రష్యా విదేశాంగ మంత్రికి ఆయన సూచించారు.

Comments

G
Loading comments...