Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆమోదం కోసం గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.

Udayam Digital Staff Apr 20, 2026 6:30 AM హైదరాబాద్ 11 views19 days ago
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆమోదం కోసం గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ. - Udayam Digital
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌ శివప్రతాప్ శుక్లాను కోరారు. అజారుద్దీన్ మంత్రి పదవికి ఆరునెలల గడువు ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ ఈ దస్త్రంపై వెంటనే ఆమోదం తెలుపుతారా లేదా కోర్టు తీర్పు కోసం వేచి చూస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఈ భేటీలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సీఎం గవర్నర్‌కు పరిచయం చేశారు.

Comments

G
Loading comments...