Back to feed
కాంగ్రెస్ బలమే ప్రజలు, కార్యకర్తలే ధైర్యం: కీలక దిశానిర్దేశం చేసిన మంత్రి దామోదర!
Udayam Digital Staff Apr 21, 2026 9:44 AM సంగారెడ్డి 10 views18 days ago

సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ జిల్లా రాజకీయ వ్యవహారాల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రసంగం చేశారు. ప్రజలే బలమని, కార్యకర్తలే ధైర్యమని పేర్కొంటూ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చారు. వర్గపోరుకు పూర్తిగా దూరంగా ఉండాలని నేతలకు సూచించారు.
ప్రభుత్వం ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఆరోగ్య శాఖలో మరో 20 వేల నియామకాలు త్వరలో చేపడతామని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, డిజిటల్ హెల్త్ కార్డులు, సింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టత కూడా ఇచ్చారు.
Comments
Loading comments...



