Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన ఇనున్‌గంబి తఖెల్లమ్‌బామ్.

Udayam Digital Staff Apr 18, 2026 5:47 AM అల్ ఇండియా 12 views21 days ago
ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన ఇనున్‌గంబి తఖెల్లమ్‌బామ్. - Udayam Digital
ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో భారత జూడోకా ఇనున్‌గంబి తఖెల్లమ్‌బామ్‌ మహిళల 70 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. క్వార్టర్స్‌లో ఓటమి ఎదురైనా, రెపిచేజ్‌ రౌండ్లో పుంజుకుని కాంస్య పోరుకు అర్హత సాధించింది. కాంస్య పతకం కోసం జరిగిన బౌట్‌లో మంగోలియా క్రీడాకారిణి సరాంట్‌సెట్‌సెగ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచింది. సుమారు 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జూడోకు ఈ ఛాంపియన్‌షిప్‌లో దక్కిన తొలి పతకం ఇదే కావడం విశేషం.

Comments

G
Loading comments...