Back to feed
ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు: రాంచందర్ రావు.
Udayam Digital Staff Apr 23, 2026 6:32 AM హైదరాబాద్ 8 views16 days ago

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పక్కనపెట్టి కాలయాపన చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారంలోపు ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలని, లేనిపక్షంలో బీజేపీ ఆందోళనల్లో భాగస్వామ్యం అవుతుందని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులు అండగా ఉంటాయని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
Comments
Loading comments...



