Back to feed
స్టాక్ మార్కెట్లలో బుల్ రన్; 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.
Udayam Digital Staff Apr 17, 2026 10:49 AM అల్ ఇండియా 17 views22 days ago

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 505 పాయింట్లు లాభపడి 78,493 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 157 పాయింట్ల పెరుగుదలతో 24,353 వద్ద ముగిసింది.
రిలయన్స్, హెచ్‌యూఎల్ వంటి దిగ్గజ షేర్లు రాణించగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 95 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 92.93 వద్ద ట్రేడవుతూ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.
Comments
Loading comments...



